BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 10:04 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పిడికిటి వెంకటేశ్వర్లు నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
16 Nov, 2026 - 10:04 PM
2 వీక్షణలు

కూటమి తరఫున బరిలోకి.. అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు

కందుకూరు(ఎన్ టుడే న్యూస్):

ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీలో గత 20 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మళ్లీ అవకాశం లభించిందని స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సారథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కావడంతో రాజకీయంగా కందుకూరులో ఎన్నికల సందడి నెలకొంది.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరఫున కందుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పిడికిటి వెంకటేశ్వర్లును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. సోమవారం కందుకూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆయన కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ అనంతరం పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

ఈ నెల 26వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.

దీర్ఘకాలం తర్వాత కందుకూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియకు అవకాశం రావడంతో స్థానికంగా రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కూటమి తరఫున చైర్మన్ అభ్యర్థిగా పిడికిటి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేయడం ఎన్నికల ప్రచారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.