BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 04:11 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా ఆర్టీఐ కమిటీ అధ్యక్షుడిగా పెద్దల చంద్రకాంత్ నియామకం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Oct, 2026 - 04:11 PM
44 వీక్షణలు

ఆర్టీఐ పరిరక్షణ కమిటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పెద్దల చంద్రకాంత్

మంచిర్యాల: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రామారావుపేట గ్రామానికి చెందిన పెద్దల చంద్రకాంత్ నియమితులయ్యారు. కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగేటి శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ ఉపాధ్యక్షుడు ఏటి ఆంజనేయులు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగంద వెంకటేష్ సూచనతో ఈ నియామకం చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి పరంది రమేష్ చంద్ర సమక్షంలో పెద్దల చంద్రకాంత్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, చట్టం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పెద్దల చంద్రకాంత్‌కు సూచించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కమిటీ మరింత చురుకుగా పనిచేయాలని తెలిపారు.

జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దల చంద్రకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజలకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.