భూ వినియోగ మార్పులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి
HMDA ఎండీ సర్పరాజ్ అహ్మద్‌కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినతి.. పెండింగ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి
ఎల్బీనగర్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో భూ వినియోగ మార్పులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం HMDA ఎండీ సర్పరాజ్ అహ్మద్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
పది ప్రాంతాల్లో భూ వినియోగ మార్పులకు ప్రతిపాదనలు
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గతంలో ఓపెన్ స్పేస్, కన్జర్వేషన్, ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లుగా కేటాయించిన భూములను నివాస ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సమర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించిన అవసరమైన పత్రాలను గతంలోనే ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు.
ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌గా మార్చేందుకు గతంలో జీవో జారీ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, మూడేళ్లు గడుస్తున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ఆ ప్రక్రియను నిలిపివేసిందని సుధీర్ రెడ్డి విమర్శించారు. ఈ ఆరోపణలను ఆయన తన వినతిలో ప్రస్తావించారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న భూ వినియోగ మార్పులకు త్వరగా ఆమోదం తెలిపి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ప్రతిపాదించిన పది భూ వినియోగ మార్పుల వివరాలు
బండ్లగూడ గ్రామం: ఆనంద్ నగర్, గోపాలకృష్ణపురం ప్రాంతాల్లోని సర్వే నంబర్లు 40/P, 41, 37లోని కొంత భాగం ప్రస్తుతం ఓపెన్ స్పేస్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని ప్రతిపాదించారు.
ఫతుల్లాగూడ గ్రామం: ఇంద్రప్రస్థ కాలనీ, ధనలక్ష్మి నగర్ ప్రాంతాల్లోని సర్వే నంబర్లు 51/P, 52/Pలోని స్థలం ప్రస్తుతం ఓపెన్ స్పేస్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని కోరారు.
కర్మన్‌ఘాట్ గ్రామం: శ్రీనివాస నగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, తపోవన్ కాలనీల్లోని సర్వే నంబర్లు 305, 306, 307, 308, 309, 310లోని స్థలం ప్రస్తుతం మాన్యుఫ్యాక్చరింగ్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని ప్రతిపాదించారు.
కొత్తపేట గ్రామం: రామలింగేశ్వర కాలనీలోని సర్వే నంబర్లు 102, 06, 107, 108, 109, 115, 116, 118, 119, 120, 121, 122లోని స్థలం ప్రస్తుతం ఓపెన్ స్పేస్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని కోరారు.
లింగోజిగూడ గ్రామం: శ్రీనివాస నగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, తపోవన్ కాలనీల్లోని సర్వే నంబర్లు 25, 26, 27, 28, 29, 30, 64, 65, 66, 71 నుంచి 79 వరకు గల స్థలం ప్రస్తుతం మాన్యుఫ్యాక్చరింగ్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని ప్రతిపాదించారు.
నాగోల్ గ్రామం: సాయినగర్ కాలనీ, అరుణోదయ కాలనీ, కో-ఆపరేటివ్ సొసైటీ కాలనీల్లోని సర్వే నంబర్లు 96, 98లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని కోరారు.
బండ్లగూడ గ్రామం: ఆనంద్ నగర్, గోపాలకృష్ణపురం ప్రాంతాల్లోని సర్వే నంబర్లు 6, 7, 8, 9, Q 11, 15, 16, 17, 46, 47, 57, 58, 61, 62, 63లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని ప్రతిపాదించారు.
హయత్‌నగర్ గ్రామం: వినాయక్ నగర్ కాలనీ, కొలన్ శివారెడ్డి నగర్ ప్రాంతాల్లోని సర్వే నంబర్లు 210, 215లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని కోరారు.
బాగ్ హయత్‌నగర్ గ్రామం: శ్రీరామ్ నగర్ కాలనీలోని సర్వే నంబర్ 97లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని ప్రతిపాదించారు.
హయత్‌నగర్ గ్రామం: బి.సి. కాలనీలోని సర్వే నంబర్ 195/2లోని స్థలం ప్రస్తుతం కన్జర్వేషన్ వినియోగంలో ఉంది. దీనిని నివాస వినియోగంలోకి మార్చాలని కోరారు.
బీఎన్ రెడ్డి నగర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి విజ్ఞప్తి
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలకు అవసరమైన పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆటస్థలాలు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధికి పరిపాలనాపరమైన, ఆర్థిక అనుమతులు వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
సానుకూలంగా స్పందించిన HMDA ఎండీ
ఎమ్మెల్యే సమర్పించిన వినతిపై HMDA ఎండీ సర్పరాజ్ అహ్మద్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సంబంధిత అంశాలను పరిశీలించి, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, వైదేహి నగర్ నార్త్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోగుల రాంబాబు, కొత్త భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.