BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 07 October 2026, 10:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోబాణంతో తెగుళ్లకు చెక్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 10:44 PM
49 వీక్షణలు

విస్సన్నపేట: రసాయన ఎరువులు, పురుగుమందులకు దూరంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ పంటలు సాగు చేస్తున్న రైతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన రైతు కావిటి పుల్లారావు 0.60 ఎకరాల్లో దేశీ రకం వరి విత్తనం నవారా సాగు చేస్తున్నారు. శ్రీ వరి పద్ధతిలో 100 శాతం రసాయన రహితంగా పంటను సాగు చేస్తున్నారు.

వరి పంటలో వివిధ రకాల శిలీంద్ర తెగుళ్ల నివారణకు పుల్లటి మజ్జిగను వినియోగిస్తున్నారు. ఐదు రోజుల పాటు పులిసిన పుల్లటి మజ్జిగను ఎకరానికి 6 లీటర్ల చొప్పున 100 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానంతో ఆకు మచ్చ, కాయ మచ్చ, బూజు వంటి శిలీంద్ర సంబంధిత తెగుళ్లను నియంత్రించేందుకు ఉపయోగపడుతుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వివరించారు.

రసాయనాల వినియోగాన్ని తగ్గించి, స్థానికంగా లభించే సహజ వనరులతో పంటల సంరక్షణ చేపట్టడం వల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు కావిటి పుల్లారావు, ఆయన సతీమణితో పాటు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఎఫ్‌ఎంటీ జి. శ్రీనివాసరావు, టీఐసీఆర్‌పీ పి. అంజిబాబు పాల్గొన్నారు.