BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 08:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 08:41 PM
13 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా విస్సన్నపేటలో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ (కవాతు) నిర్వహించారు. తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. గురు ప్రకాష్ ఆధ్వర్యంలో రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ రామచంద్రరావు సమక్షంలో పోలీసు బలగాలు కవాతు చేపట్టాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు, ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతాన్ని పోలీసు శాఖ ఈ కవాతు ద్వారా ఇచ్చింది. ఈ సందర్భంగా రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి గొడవలు, అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి విస్సన్నపేటలో ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని అధికారులు కోరారు. ఎన్నికల వేళ పోలీసుల ఫ్లాగ్ మార్చ్‌తో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత బలోపేతమయ్యాయి.