BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 10:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 10:04 PM
35 వీక్షణలు

నలుగురు అదుపులో.. రూ.16,820 నగదు, 4 సెల్‌ఫోన్లు, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్, నూజివీడు రూరల్ సీఐ ఐ.వి. నాగేంద్రకుమార్ ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణకు అందిన సమాచారం ఆధారంగా 27/28 సెప్టెంబర్ 2026 రాత్రి చాట్రాయి గ్రామ శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16,820 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై చాట్రాయి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ జూదం వల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున ఎవరైనా జూదాన్ని ప్రోత్సహించినా, జూదంలో పాల్గొన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జూదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే డయల్‌ 112కు లేదా చాట్రాయి ఎస్సై ఫోన్ నంబర్ 9440796455కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.