BREAKING
thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:15 pm
Posted by : కూనురు మధు

ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు న్యాయం చేయాలి

తెలంగాణ
/ నల్గొండ
02 Nov, 2026 - 08:15 PM
13 వీక్షణలు


అధికారులకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం.. గ్రీవెన్స్ డేలో 34 మంది ఫిర్యాదులు

NTODAY NEWS : చిట్యాల

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి, బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి వచ్చిన సుమారు 34 మంది బాధితుల నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను సవివరంగా విని, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బాధితులు భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, ఆస్తి సంబంధిత వివాదాలు తదితర అంశాలపై తమ ఫిర్యాదులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఆయన సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టపరమైన నిబంధనల ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా ప్రతి కేసు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ప్రజలు పోలీస్ శాఖపై నమ్మకంతో తమ సమస్యల పరిష్కారం కోసం వస్తున్నందున వారి ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యలను వివరించే అవకాశం కల్పిస్తున్నామని, ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిస్తూ చట్ట పరిధిలో సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.