BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 08:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజ్యాంగ పరిరక్షణకు నవంబర్ 26న దేశవ్యాప్త నిరసనలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 08:27 AM
24 వీక్షణలు

సేవ్ ఇండియా.. సేవ్ డెమోక్రసీ నినాదంతో వామపక్షాలు, రైతు సంఘాల పిలుపు విస్సన్నపేట: భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి.. దేశాన్ని కాపాడండి.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అనే నినాదంతో నవంబర్ 26ను నిరసన దినంగా పాటించాలని వామపక్షాలు, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందిందని, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. రాజ్యాంగం ఆమోదం పొందిన చారిత్రక రోజునే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన చారిత్రక రైతాంగ ఉద్యమం ప్రారంభమై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నిరసనలకు పిలుపునిచ్చినట్లు హరినాథ్ తెలిపారు. రైతాంగ ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 26ను బ్లాక్ డేగా పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసించాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు హిందూ మతోన్మాద, ఫాసిస్టు శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా ఓట్లు రద్దయ్యాయని, ఆంధ్రప్రదేశ్‌లోనూ 13 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని హరినాథ్ ఆరోపించారు. ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు పరోక్షంగా మద్దతు తెలపడం సిగ్గుచేటని విమర్శించారు. గొప్ప పోరాట చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా నిలిచి భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని, భారత్‌–అమెరికా–యూరప్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు ఉపాధి హామీ చట్టం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించి, రోజువారీ కనీస వేతనాన్ని రూ.700గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 28న విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని డి. హరినాథ్ విజ్ఞప్తి చేశారు.