BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 26 June 2026, 01:22 pm
Posted by : JP.NAGIREDDY

రాష్ట్రంలో మూడు రోజులు రిజిస్ట్రేషన్ సేవలు బంద్.. జూన్ 29 నుంచి యథావిధిగా సేవలు

ఆంధ్రప్రదేశ్
Reporter
JP.Nagireddy రాయచోటి మండల ప్రతినిధి
26 Jun, 2026 - 01:22 PM
97 వీక్షణలు

అమరావతి | N Today News

రాష్ట్రంలోని స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సేవలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉండవని అధికారులు వెల్లడించారు. శాఖ వెబ్‌సైట్‌తో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవల సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అధికారుల సమాచారం ప్రకారం, జూన్ 26 నుంచి జూన్ 28 వరకు శాఖకు సంబంధించిన సేవలు నిలిపివేయబడతాయి. ఈ కాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవు.

జూన్ 26న మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, జూన్ 28 ఆదివారం సెలవు. మధ్యలో ఉండే జూన్ 27 (శనివారం) పనిదినమైనప్పటికీ, సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ముఖ్యంగా ఆన్‌లైన్ చెల్లింపుల సేవలు అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

సర్వర్ నిర్వహణ పనులు పూర్తైన అనంతరం జూన్ 29 నుంచి స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖ సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ అవసరాలు ఉన్న ప్రజలు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.