BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 08:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు తిరువూరు విద్యార్థినులు ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 08:39 PM
22 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం నరసాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ జూనియర్స్ బాలబాలికల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తిరువూరు పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

పాఠశాలకు చెందిన జి. గీతా భవిష్య, ఎం. మయూరి, కె. నాగలక్ష్మి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల తెలిపారు. విద్యార్థినులకు శిక్షణ అందించిన పీడీలు జి. సుకన్య, బి. జయలక్ష్మిని, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను పాఠశాల సిబ్బంది అభినందించారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో కడప జిల్లా పుల్లంపేటలో నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థినులు పాల్గొని ప్రతిభ కనబరచాలని పాఠశాల సిబ్బంది ఆకాంక్షించారు.