BREAKING
thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం
Test 4
Date of Publish : 25 November 2026, 07:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఆరు జిల్లాలకు వర్ష సూచన

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:49 AM
29 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 25 నుంచి 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రహదారులపై ప్రయాణించే సమయంలో వేగ నియంత్రణ పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. నవంబర్ 29వ తేదీ నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.