BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 06:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాడిగడపలో కూటమి అభ్యర్థులకు ఓటేయాలని రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 06:55 PM
25 వీక్షణలు

యనమలకుదురు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు పిలుపు 

తాడిగడప, నవంబర్ 26: ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గురువారం తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా యనమలకుదురులోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడి ఐకమత్యంగా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అందుకే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అఖండ విజయాన్ని అందించారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ, మున్సిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ సొంటి శివరామప్రసాద్, సగర కార్పొరేషన్ డైరెక్టర్ తాడిశెట్టి వీరస్వామి, రాష్ట్ర మైనారిటీ నాయకుడు సయ్యద్ అజ్మతుల్లా, యూనిట్ ఇన్‌ఛార్జి చలపాటి శ్రీను, యనమలకుదురు మాజీ సర్పంచ్ బిచ్చాలు తదితరులు పాల్గొన్నారు.