రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజుకు ఘన సన్మానం
ఉద్యోగ భద్రత, కనీస వేతనం, రూ.300 కమిషన్ ఇవ్వాలి: రేషన్ డీలర్ల డిమాండ్
నెల్లికుదురు, అక్టోబర్ 27 | ఎన్ టుడే న్యూస్:
ప్రభుత్వ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకోటి రాజును నెల్లికుదురు మండల రేషన్ డీలర్లు ఘనంగా సన్మానించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కొయ్యేడి వెంకటేశ్వర్లు గౌడ్, బాదం ఉప్పలయ్య ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు ఆయనకు పూల బొకే అందించి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనం అమలు చేయడంతో పాటు రూ.300 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రేషన్ డీలర్ల ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నూతన రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు నాయకత్వంలో ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడతామని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకోటి రాజుకు, నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర కమిటీ సభ్యులకు మండల రేషన్ డీలర్లు శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ డీలర్ల హక్కుల సాధనకు సంఘం ఐక్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్లు సంద అనిల్, సలుగు శ్రీను, విష్ణు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.