BREAKING
thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు
Date of Publish : 09 October 2026, 08:09 pm
Posted by : V శ్రీనివాస్

రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ రాములు

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
09 Oct, 2026 - 08:09 PM
35 వీక్షణలు

మంచిర్యాల: రీ-సర్వే గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం తదుపరి చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో తన ఛాంబర్‌లో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, తాండూర్, నెన్నెల, భీమిని, వేమనపల్లి మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రీ-సర్వే గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఇంకా మిగిలి ఉన్న పనులను గుర్తించి, సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.

సర్వే కార్యకలాపాలను వేగవంతం చేసి, ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.,

ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.