వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్‌కు వినతి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి నియోజకవర్గానికి చెందిన వీఆర్ఏల సంఘ సభ్యులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు.
వీఆర్ఏలకు పే స్కేల్ పెంపుతో పాటు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.
వీఆర్ఏల సమస్యలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సానుకూలంగా విన్నారు. సంబంధిత అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.