నగర పంచాయతీ చైర్మన్ పదవికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి
చింతలపూడి, అక్టోబర్ 7: ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారం బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఉంటే చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్.కె. అబ్దుల్ గఫూర్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నానని అబ్దుల్ గఫూర్ తెలిపారు. ముస్లిం సామాజిక వర్గంతో పాటు అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలను కలుపుకొని పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తున్నందున తనకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు.
చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్‌కు అనుగుణంగా బీసీ వర్గానికి అవకాశం వచ్చిన పక్షంలో తనను చైర్మన్ అభ్యర్థిగా పరిగణించాలని ఆయన వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌ను కలిసి తన అభ్యర్థనను వివరించారు.
కార్యక్రమంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.