BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 02 October 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బాల్య వివాహ రహిత గ్రామాలుగా ప్రకటిస్తూ గ్రామసభలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 08:32 PM
7 వీక్షణలు

బాల్య వివాహ రహిత గ్రామాలుగా ప్రకటిస్తూ గ్రామసభలో తీర్మానం పరిశుభ్రత, గ్రామాభివృద్ధిపై అవగాహన కల్పించిన అధికారులు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలంలోని వినగడప, గంపలగూడెం గ్రామాల్లో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభలు నిర్వహించారు. బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా ప్రకటిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు.

ఈ సందర్భంగా మండల ఎంపీడీవో టి. సరస్వతి మాట్లాడుతూ ‘స్వచ్ఛత హి సేవ’ అంటే పరిశుభ్రతే సేవ అని, ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వీధి, గ్రామం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామపంచాయతీ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాలను శుభ్రపరచడం, ఇంటింటికీ చెత్త సేకరణను ప్రోత్సహించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను నిర్వహించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని వివరించారు.

అనంతరం బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి కుటుంబం సహకరించాలని ఎంపీడీవో కోరారు. బాలికలు 18 సంవత్సరాలు, బాలురు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిగేలా చూడాలని, పిల్లల భవిష్యత్తుకు విద్య ఎంతో ముఖ్యమని ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించాలని సూచించారు.

వాసవ్య మహిళా మండలి, జస్ట్ ఫర్ రైట్స్ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ గ్రామసభల్లో బాల్య వివాహ రహిత గ్రామాలుగా ప్రకటిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, కాజా రవి, ఏపీవో, వాసవ్య మహిళా మండలి సభ్యుడు ఎం. శివరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.