తిరువూరు నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ బాధ్యతలు కార్యకర్తలకు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు నియోజకవర్గంలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనుల బాధ్యతలను కార్యకర్తలకు అప్పగించే కార్యక్రమానికి శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా అధికారుల సమక్షంలో కార్యకర్తలకు సిమెంట్ రోడ్ల నిర్మాణ బాధ్యతలను అప్పగించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 19న ఉదయం 10:30 గంటలకు తిరువూరులోని శాసనసభ్యుల కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన బాధ్యతలను కార్యకర్తలకు అధికారికంగా అప్పగించనున్నారు.
కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యుల కార్యాలయం కోరింది.