BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 06:16 pm
Posted by : NTODAY NEWS

బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
08 Oct, 2026 - 06:16 PM
37 వీక్షణలు

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు సీఐటీయూ నాయకుల వినతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (ఎన్‌టుడే న్యూస్‌): బతుకమ్మ కుంట భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద మహిళలకు మూత్రశాలలు, కార్మికులకు మంచినీటి సౌకర్యం, షెడ్డు, రూ.5కే భోజనం అందించే సదుపాయం కల్పించాలని కోరుతూ సీఐటీయూ నాయకులు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు జి. రాములు మాట్లాడుతూ.. బతుకమ్మ కుంట భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలుగా ఈ అడ్డా నుంచి రోజువారీ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే అడ్డా వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఎండాకాలంలో చెట్టు నీడ మినహా ఎలాంటి రక్షణ లేకుండా ఎండలోనే ఉండాల్సి వస్తోందని, వర్షాకాలంలో వర్షానికి తడుస్తూనే పని కోసం వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. పని దొరికే వరకు గంటల తరబడి అడ్డా వద్ద ఉండే కార్మికులకు తాగునీరు, మూత్రశాలలు లేకపోవడం వల్ల మహిళలు, పురుషులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ కుంట లేబర్‌ అడ్డా వద్ద మహిళలకు, పురుషులకు మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేందుకు షెడ్డు నిర్మించాలని, కార్మికుల కోసం రూ.5కే భోజనం అందించే సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు.

కార్మికుల సమస్యలను విన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ వెంటనే స్పందించినట్లు నాయకులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం సంబంధిత అధికారులను అడ్డా వద్దకు తీసుకువచ్చి సమస్యలను పరిశీలించి, కార్మికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ నగర కార్యదర్శి బి. సుబ్బారావు, బతుకమ్మ కుంట లేబర్‌ అడ్డా మాజీ అధ్యక్షులు సురేష్‌ నాయక్‌, ధర్మానాయక్‌, అడ్డా నాయకులు సురేష్‌, కమిటీ సభ్యురాలు కవిత, సరోజ, అరుణ, కమల, అనూష తదితరులు పాల్గొన్నారు.