BREAKING
thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం
Test 4
Date of Publish : 24 November 2026, 11:01 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్‌కు రింగ్ రోడ్డు, మామిడిపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
24 Nov, 2026 - 11:01 PM
17 వీక్షణలు

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేసిన ఆర్మూర్ నియోజకవర్గ నేత

హైదరాబాద్, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్:

ఆర్మూర్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు.

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) సదస్సు సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసి ఈ విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి రింగ్ రోడ్డు మంజూరు చేయాలని, మామిడిపల్లి–ఆర్మూర్ మార్గంలో ఎన్‌హెచ్‌-44 జాతీయ రహదారి వద్ద ఫ్లైఓవర్ లేదా బ్రిడ్జి నిర్మించాలని కోరారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. అలాగే ఎన్‌హెచ్‌-44పై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వినతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వినతిపత్రం అందజేసిన నేత తెలిపారు.