లక్ష్మీపురంలో రోడ్డు ప్రమాదం డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కర్రల లారీ
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న కర్రల లోడుతో కూడిన లారీ అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. రాత్రివేళ వాహనాలు నడిపే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నిద్రమత్తులో వాహనాలు నడపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు సూచిస్తున్నారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.