మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేస్తున్న మేడి శేఖర్ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా మేడి శేఖర్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు