BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా మధిర డిపోలో ఆర్టీసీ కార్మికుల విధుల బహిష్కరణ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 02:19 PM
7 వీక్షణలు

మధిర, నవంబర్ 4: మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ ప్రవళిక మృతి పట్ల ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికురాలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రవళిక, గత పది రోజులుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఈ విషాద ఘటనను నిరసిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధిర డిపో కార్మికులు మొదటి బస్సు నుంచే విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ ఎండనకా, వాననకా ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల ప్రాణాలకే రక్షణ లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కండక్టర్ ప్రవళిక మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆమె కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులందరికీ విధి నిర్వహణలో పూర్తి భద్రత కల్పించాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో మధిర డిపో జేఏసీ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రవళిక మృతికి సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.