BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 10 October 2026, 07:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పదేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికులకు ఓటు హక్కు

తెలంగాణ
/ నాగర్ కర్నూల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 07:45 AM
8 వీక్షణలు

నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోలో 63.16 శాతం పోలింగ్

నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం నాగర్ కర్నూల్ డిపోలో ఉత్సాహంగా కొనసాగాయి. దాదాపు పదేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నాగర్ కర్నూల్ డిపో పరిధిలో మొత్తం 285 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 10.30 గంటల వరకు 180 మంది ఓటు వేశారు. దీంతో 63.16 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం–నల్గొండ రీజియన్ పరిధిలో అదే సమయానికి మొత్తం 1,350 ఓట్లు పోలైనట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో ప్రతి ఉద్యోగికి రెండు ఓట్లు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం ఎంపికకు ఒక ఓటు, రీజియన్ స్థాయి గుర్తింపు సంఘం ఎంపికకు మరో ఓటు వేయాల్సి ఉంటుంది.

ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లోని అశ్వత్థామ రెడ్డి వర్గం, సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఐఎన్‌టీయూసీ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, బహుజన కార్మిక యూనియన్ కలిసి కూటమిగా మద్దతు ప్రకటించాయి. రాష్ట్రస్థాయి గుర్తింపు కోసం తెలంగాణ వర్కర్స్ యూనియన్ కూటమికి, ఖమ్మం–నల్గొండ రీజియన్ స్థాయి గుర్తింపు కోసం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించాయి.

పదేళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆసక్తి నెలకొంది. తమ సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే సంఘాలకు మద్దతు తెలిపేందుకు ఉద్యోగులు పోలింగ్‌లో పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ డిపోలో ఉదయం నుంచే సందడి కనిపించగా, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.