రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు
రైతులకు అండగా ‘రైతు నేస్తం' రుణాలు వెలిచేరు సొసైటీలో చెక్కుల పంపిణీ చేసిన సొసైటీ అధ్యక్షుడు నాగిరెడ్డి
ఆత్రేయపురం మండలంలోని వెలిచేరు ప్రాథమిక వ్యవసాయ | సహకార సంఘం (సొసైటీ)లో సోమవారం రైతులకు కొత్తగా మంజూరైన 'రైతు నేస్తం' రుణాలు చెక్కులను సొసైటీ అధ్యక్షుడు నాగిరెడ్డి సత్యనారాయణ, సీఈవో సోమన్న, బ్యాంక్ సూపర్వైజర్ ఎం. శ్రీనివాసరావు రైతులకు రుణాల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అవసరాల కోసం సహకార సంఘాల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల ఆర్థికాభివృద్ధితో పాటు వ్యవసాయ రంగ పురోగతిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు అందిస్తూ వ్యవసాయ కార్యకలాపాలకు సహకార సంఘాలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.