BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 June 2026, 09:33 pm
Posted by : V శ్రీనివాస్

​సి సి కెమెరాల ద్వారా ప్రమాదాలు, నేరాల నియంత్రణ: రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
10 Jun, 2026 - 09:33 PM
164 వీక్షణలు

భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో సి సి కెమెరాల ప్రారంభం

​భీమారం, జూన్ 10 (నిఘా ప్రతినిధి): சி సి కెమెరాల ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలను, నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా భీమారం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సి సి కెమెరాలను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, డి సి పి ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జైపూర్ ఎ సి పి వెంకటేశ్వర్లు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక సి సి కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా విషయాలను గ్రహించి భద్రపరుస్తుందని, చెన్నూర్ నియోజకవర్గవ్యాప్తంగా వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి, మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుని యువత భవిష్యత్తును కాపాడాలని పిలుపునిచ్చారు.

​ప్రజాపాలన గ్రామసభలో మహిళలు, పేదల సంక్షేమ పథకాల ప్రకటన 

​అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమానికి రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, డి సి పి ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మిలతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో భాగంగానే మహిళా సమాఖ్య సభ్యులకు మండలానికి ఒకటి చొప్పున ఆర్ టి సి బస్సులు అందజేయడంతో పాటు, వ్యాపార అభివృద్ధి కొరకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలు అందించి తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. మహిళను ఇంటి పెద్దగా గుర్తిస్తూ చెన్నూర్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రెండవ విడతలో 2,000 ఇండ్లు కేటాయించడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం, అర్హులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పెన్షన్లు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు.

​నియోజకవర్గ విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ముందడుగు

​విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, చెన్నూర్ లో 100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించబోతున్నామని, స్టేడియం, నర్సింగ్ కాలేజ్ మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మైనర్లు వాహనాలు నడపకూడదని సూచిస్తూ ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని అదనపు కలెక్టర్ కోరగా, చివరగా మండలంలోని 28 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు