BREAKING
thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు
Date of Publish : 05 October 2026, 10:32 am
Posted by : SEETHA KIRAN KUMAR

ఆరోపణల నేపథ్యంలో పురుగుమందు తాగి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Oct, 2026 - 10:32 AM
2 వీక్షణలు
కరీంనగర్ జిల్లా: కొండాయపల్లి గ్రామ సర్పంచ్ మల్యాల వినయ్‌సాగర్ ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు ఆయనను అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.

తన గ్రామ అభివృద్ధి అంశాలపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే తనపై అక్రమ కేసులు పెట్టించారని వినయ్‌సాగర్ ఆరోపించినట్లు సమాచారం. అలాగే సర్పంచుల వాట్సాప్ గ్రూపులో తనను అవమానించారని, డబ్బులు డిమాండ్ చేసినట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆసుపత్రికి వెళ్లి వినయ్‌సాగర్‌ను పరామర్శించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సర్పంచ్ చేసిన ఆరోపణలపై సంబంధిత ఎమ్మెల్యే లేదా ఇతరుల స్పందన తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.