BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 04:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అన్నమయ్య జిల్లా భాగంపల్లెలో మరోసారి ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 04:30 PM
20 వీక్షణలు

 20 ఏళ్లుగా ఆదర్శ గ్రామపంచాయతీగా గుర్తింపు

గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి.. ఎన్నికైన సర్పంచ్‌కు భాగంపల్లి అజయ్ రెడ్డి అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా పరిధిలోని భాగంపల్లె గ్రామపంచాయతీ మరోసారి ఏకగ్రీవ ఎన్నికతో ప్రత్యేక గుర్తింపు చాటుకుంది. గత 20 సంవత్సరాలుగా ఆదర్శ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న భాగంపల్లెలో తాజాగా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. భాగంపల్లి అజయ్ రెడ్డి బలపరిచిన ఉమ్మడి కూటమి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు ఎన్నికైన సర్పంచ్‌కు సంబంధించిన ఏకగ్రీవ ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల అధికారి (ఆర్‌ఓ) నుంచి స్వీకరించారు.

ఈ సందర్భంగా భాగంపల్లి అజయ్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గ్రామ ప్రజలు ఏకాభిప్రాయంతో అవకాశం కల్పించడం ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ భాగంపల్లెను మరింత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.