BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 05:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు డివిజన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 05:30 PM
22 వీక్షణలు

క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆర్డీఓ ఏ. కుమార్

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ పలు గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. తిరువూరు మండలంలోని లక్ష్మీపురం, చింతలపాడు గ్రామాలతో పాటు గంపలగూడెం మండలంలోని గంపలగూడెం, వినగడప గ్రామాల్లో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, నామినేషన్ల స్వీకరణ తీరును నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఏ. కుమార్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి పొరపాట్లకు, వివాదాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి దశను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ అధికారులకు దిశానిర్దేశం చేశారు.