కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు.. విజయవాడలో అరెస్టుల పర్వం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ధర్నా చౌక్‌కు చేరుకున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 100 మంది ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
విజయవాడకు వెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు ముందుగానే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి విజయవాడకు వస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు యూనియన్ నేతలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు.