BREAKING
thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ
Date of Publish : 07 October 2026, 09:45 pm
Posted by : MUSUGU GOPI

పెదకూరపాడులో ఘనంగా సేవా జ్యోతి యాత్ర

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
07 Oct, 2026 - 09:45 PM
10 వీక్షణలు

పెదకూరపాడు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ‘సేవా జ్యోతి యాత్ర’ నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బైక్ ర్యాలీ చేపట్టారు.

నియోజకవర్గ కేంద్రంలో ‘సేవా జ్యోతి’ వెలిగించి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రజా సేవను లక్ష్యంగా చేసుకుని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవ, సంకల్పం, సుపరిపాలనకు ప్రతీకగా మోదీ ప్రజా సేవా ప్రస్థానాన్ని వారు కొనియాడారు.

బైక్ ర్యాలీ నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా కొనసాగింది. అనంతరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సేవా జ్యోతి వెలిగించి మోదీ ప్రజా జీవితాన్ని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వెన్నా సాంబశివరెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు షేక్ నూర్జహాన్, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.