BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంగన్వాడీ కేంద్రంలో సేవా సంకల్ప్ అభియాన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 06:47 PM
3 వీక్షణలు

తిరువూరు, అక్టోబర్ 7: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తునికిపాడు పంచాయతీ శివారు భగవాన్‌పురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని రెండో రోజు నిర్వహించారు.

కార్యక్రమంలో భాగంగా జోనెపోయిన భానుతేజ్, చిర్రా ఉమేష్ చిన్నారులకు వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు తొలిసారిగా అన్నం తినిపించే కార్యక్రమం వైభవంగా జరిగింది.

అనంతరం నిర్వహించిన సభలో అంగన్వాడీ టీచర్ పదిలం వెంకాయమ్మ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లల ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. ఆరు నెలల వయస్సు పూర్తైన తర్వాత తల్లిపాలతో పాటు తప్పనిసరిగా అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను తల్లిదండ్రులు, అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సంబంధిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, మహిళలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.