BREAKING
thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ
Date of Publish : 07 August 2026, 05:33 pm
Posted by : NTODAY NEWS

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
07 Aug, 2026 - 05:33 PM
55 వీక్షణలు

తిరుపతి, 2026 ఆగస్టు 07:: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఆడికృత్తిక పర్వదినం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం

ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా విశేష అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం తిరువీధుల్లో స్వామివారి దివ్య విహారం

సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ఈ తిరువీధి ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.