రొంపిచర్లలో 11 నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు
భక్తి
భక్తి
రొంపిచర్ల: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల కేంద్రంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త మద్ది రామచంద్రరావు, స్థానిక ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
పది రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో ప్రతిరోజూ ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య ఏకాదశ రుద్రాభిషేకాలు, మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసే భక్తులకు మహా అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు.
సాయంత్రం వేళల్లో భక్తిరంజక భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే ప్రతిరోజూ లక్కీ డ్రా నిర్వహించి భక్తులకు అమ్మవారి చీరలను బహుమతులుగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని ఆలయ ఉపాధ్యక్షుడు గొడవర్తి వెంకటేశ్వర్లు, వాసవి సేవాదళ్ కన్వీనర్ పసుమర్తి ఆదినారాయణ, అరవపల్లి వ