BREAKING
thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ
Date of Publish : 07 October 2026, 09:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల మౌన దీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 09:44 PM
16 వీక్షణలు

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల మౌన నిరసన

చాట్రాయి, అక్టోబర్ 7:

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలానికి చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం మౌనం పాటిస్తూ నిరసన తెలిపారు. రిలే దీక్ష చేస్తున్న వీఆర్ఏలు మౌన నిరసన చేపట్టి  ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా వీఆర్ఏ యేసోబు మాట్లాడుతూ, వీఆర్ఏలు చాలాకాలంగా వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పరిష్కారం లభించలేదని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు రిలే దీక్షలు చేపడుతున్నారని, ఈ రోజు చాట్రాయి మండల వీఆర్ఏలు మౌనం పాటిస్తూ నిరసన చేపట్టినట్లు చెప్పారు.

గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అనేక పనుల్లో వీఆర్ఏలు తమ విధులను నిర్వహిస్తున్నారని యేసోబు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో వీఆర్ఏలు కీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

రిలే దీక్ష చేస్తున్న వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, వారితో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని, తమకు భరోసా కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.