కనిగిరి నియోజకవర్గంలో SMC ఎన్నికలు వాయిదా
కనిగిరి, Ntoday News, సెప్టెంబర్ 27: ఈ నెల 29న వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన, సభ నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో నిర్వహించాల్సిన పాఠశాలల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఈ ఆరు మండలాల్లో జరగాల్సిన SMC ఎన్నికలను అక్టోబర్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు (MEOలు), ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు సమాచారం అందించారు.
అయితే మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలోని మిగిలిన 15 మండలాల్లో మాత్రం ఈ నెల 29న SMC ఎన్నికలు యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా మండలాల MEOలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.