BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 12 October 2026, 04:06 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Oct, 2026 - 04:06 PM
9 వీక్షణలు

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ శేఖర్ (36) మృతి చెందాడు. హరియాణాకు చెందిన ఆయన రాయదుర్గం పరిధిలో తన సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి సౌరభ్ శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఆయన కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీ, వీవీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆదివారం ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆయన సోదరుడు సంబంధిత ఫ్లాట్‌కు వెళ్లాడు.

ఫ్లాట్ తలుపులు పగలగొట్టి చూడగా సౌరభ్ విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ హీలియం గ్యాస్ సిలిండర్‌తో పాటు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

సౌరభ్ గత పదేళ్లుగా భోజనం చేసిన తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సూసైడ్ నోట్‌తో పాటు ఇతర అంశాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే మృతికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.