BREAKING
thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు
Date of Publish : 07 October 2026, 10:06 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు సమస్యలు స్థానికుల హక్కుల పరిరక్షణ కొరకు కేంద్ర మంత్రితో ప్రత్యేక చర్చలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 10:06 AM
10 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు ​​న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) సదస్సు మరియు ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా, భారత ప్రభుత్వ బొగ్గు మరియు గనుల శాఖ గౌరవనీయ కేంద్ర సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే ని కలిసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ అయూబ్ ఖాన్  పుంగనూరు ప్రాంత ప్రజల సమస్యలపై మరియు "మన పుంగనూరు - మన హక్కు" సాధన అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.

​ఈ సమావేశంలో పుంగనూరు నియోజకవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన స్థానిక సమస్యలను, అభివృద్ధిలో వెనుకబాటుతనాన్ని మరియు ప్రజలు కోరుతున్న హక్కులను మంత్రి  దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లడం జరిగింది. పుంగనూరు ప్రాంత సమగ్రాభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా తగిన సానుకూల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయనను కోరడం అయినది.

​స్థానికుల హక్కుల పరిరక్షణ కోసం మరియు పుంగనూరు భవిష్యత్తు అభివృద్ధి కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర స్థాయి నుండి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి  సానుకూలంగా స్పందించారు.