BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:58 pm
Posted by : KOLA MAHESH

నీర్నెములలో ఎల్‌నినో ప్రభావాలపై ప్రత్యేక గ్రామసభ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 09:58 PM
13 వీక్షణలు
  • నీరు, విద్యుత్‌ పొదుపుతో కరువు పరిస్థితులను ఎదుర్కోవాలి: సర్పంచ్‌ కందిమల్ల గోపాల్‌రెడ్డి

రామన్నపేట, అక్టోబర్‌ 27 | ఎన్‌ టుడే న్యూస్‌:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావాలతో ఎదురయ్యే పరిస్థితులపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ కందిమల్ల గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే నెలల్లో కరువు, నీటి కొరత, పంట నష్టాలు, విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు.

నీటి ఎద్దడిని తట్టుకోగల పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ అధికారి ఎజాజ్‌ అలీ ఖాన్‌ సూచించారు. తక్కువ నీటితో సాగు చేసే అవకాశం ఉన్న మునగ పంటను ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని, దాని పోషక విలువలు, ఆదాయ అవకాశాలను రైతులు పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇళ్ల వద్ద, పొలాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ఆశిష్‌ రాఘవ, ఏపీఓ వెంకన్న సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే చర్యలు భూగర్భ జలాల పెంపునకు దోహదపడతాయని వివరించారు.

తాగునీటిని వృథా చేయకుండా వినియోగించాలని, వ్యవసాయంలో డ్రిప్‌, స్ప్రింక్లర్‌ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలని హెచ్‌ఈఓ గోపాల్‌ సూచించారు. ఎండ తీవ్రత సమయంలో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అనవసరమైన విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించాలని, సాధ్యమైనంత వరకు పగటిపూట వ్యవసాయ మోటార్ల వినియోగాన్ని నియంత్రించేందుకు సహకరించాలని విద్యుత్‌ శాఖ ఏఈ కోటేశ్వరరావు, లైన్‌మన్‌ నవీన్‌ కోరారు.

ఎండ తీవ్రత వల్ల మనుషులు, పశువులకు కలిగే ఇబ్బందులు, వడదెబ్బ నివారణ చర్యలపై వెటర్నరీ అసిస్టెంట్‌ రఘు, హెచ్‌ఎం రవి అవగాహన కల్పించారు.

గ్రామంలో నీటి సంరక్షణ, విద్యుత్‌ పొదుపు, పంటల ఎంపిక, ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన చర్యలను సమన్వయంతో అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాబోయే ఎనిమిది నెలల కార్యాచరణ ప్రణాళికను గ్రామసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎం.డి. రఫీ, డిప్యూటీ తహసీల్దార్‌ శైలజ, ఏపీఓ వెంకన్న, జీపీఓ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మిరియాల లక్ష్మి, వార్డు సభ్యులు ముత్యాల కిషన్‌, పెరుమాండ్ల నవీన్‌, బోయిని ఐలమ్మ, కట్ట సాత్విక, వీబీకే ముత్యాల రాణి, అంగన్‌వాడీ టీచర్లు మంగమ్మ, సౌజన్య, మాజీ ఉపసర్పంచ్‌ చల్ల సత్యప్రకాశ్‌, నాయకులు నోముల విష్ణు, బోయిని మల్లేష్‌, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.