శ్రీ ఆగిస్తీశ్వర స్వామి సన్నిధి లో మోడీ కి ప్రత్యేక పూజలు
మోదీ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయల్ కుమార్
పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీ పరిధిలోని శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు మీద జనసేన నాయకుడు రాయల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో 25 సంవత్సరాలుగా నిరంతరం ప్రజా సేవకు కృషి చేస్తూ, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడిగా రాయల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ఆయురారోగ్యాలతో ఉండి మరింత కాలం ప్రజలకు సేవలు అందించేలా శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ అగస్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక, సైనిక రంగాల్లో అనేక మార్పులను సాధించిందని రాయల్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాల ద్వారా దేశీయ తయారీ రంగానికి ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు.
భారతదేశాన్ని అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశ అభివృద్ధికి దోహదపడుతున్నాయని రాయల్ కుమార్ అన్నారు. మోదీకి ప్రజాసేవలో మరింత శక్తి, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకుడు మంజునాథ్ స్వామి, జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, మనోజ్, నాన బాల ఉదయ్, వేణు రాయల్, జనసైనికులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.