BREAKING
thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Test 4
Date of Publish : 04 November 2026, 05:24 pm
Posted by : కూనురు మధు

వరుస అకాల మరణాలు తొలగిపోవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Nov, 2026 - 05:24 PM
26 వీక్షణలు
  • మంచినీటితో జలాభిషేకం.. గుమ్మడికాయ, కొబ్బరికాయలతో మొక్కులు

చిట్యాల పట్టణంలో వరుసగా చోటుచేసుకుంటున్న అకాల మరణాలు తొలగిపోయి, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఎల్‌నినో ప్రభావం తగ్గి, కరువు కాటకాలు తొలగిపోయి సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా బొడ్రాయికి మంచినీటి బిందెలతో జలాభిషేకం చేశారు. అనంతరం మామిడి తోరణాలు కట్టి, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇటీవల పట్టణంలో వరుసగా అకాల మరణాలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పట్టణానికి ఎలాంటి అరిష్టాలు, ఆపదలు కలగకుండా ఉండాలని, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఈ పూజా కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండే సైదులు, బీఆర్‌ఎస్‌ నాయకులు బొబ్బల శివశంకర్ రెడ్డి, జిట్ట పద్మ బొందయ్య, ఆగు అశోక్ యాదవ్, దయ్యాల శ్రీకాంత్, రుద్రవరం యాదయ్య, మారగోని రమేష్, సాయి రెడ్డి, ప్రతాపరెడ్డి, పాల కృష్ణ, కూనూరు శంకర్, సుర్కంటి నర్సిరెడ్డి, జిట్ట శేఖర్, బోల్గోరి సైదులు, ఆవుల ఆనంద్, ఉప్పలపల్లి నగేష్, రాగుల శివ, చింతపల్లి ప్రవీణ్, గూడ అఖిల్, పల్లె రాజేందర్ గౌడ్, నల్ల శివారెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.