BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 12 October 2026, 08:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో వైభవంగా శ్రీ సత్య సాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Oct, 2026 - 08:29 PM
12 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం సాయంత్రం శ్రీ సత్య సాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగింది. సాయినామస్మరణ, భక్తి గీతాల నడుమ గ్రామ ప్రధాన వీధుల గుండా రథయాత్ర కొనసాగడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మధిర రోడ్డులోని శివాలయం ఆర్చి నుంచి ప్రారంభమైన రథయాత్ర రామాలయం, బస్టాండ్ సెంటర్, బొడ్రాయి సెంటర్ మీదుగా ముందుకు సాగింది. రథయాత్రలో పాల్గొన్న భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటూ నామస్మరణ చేస్తూ భక్తి పాటలు ఆలపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రథయాత్రలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. రథయాత్ర తమ ఇళ్ల ఎదుటకు చేరుకున్న సమయంలో స్థానికులు హారతులు ఇచ్చి, నీటిని చల్లి భక్తిపూర్వకంగా స్వాగతం పలికారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు స్థానిక సత్య సాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో శివాలయ ప్రాంగణంలో అల్పాహార ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ రథయాత్ర గంపలగూడెం మండలంలోని సత్యాలపాడు, మేడూరు, గంపలగూడెం మీదుగా తిరువూరు చేరుకుంటుందని తిరువూరు నియోజకవర్గ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ డి. ప్రభాకర్ రావు తెలిపారు. సత్య సాయి బోధనలైన ప్రేమ, సేవ, మానవత్వం, ఆధ్యాత్మికతను ప్రజల్లో విస్తరించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని సేవా కార్యక్రమాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పారేపల్లి కృష్ణారావు, రామదాసు, నాళ్ల శ్రావణి, జి. తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.