BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 01:46 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
21 Nov, 2026 - 01:46 PM
51 వీక్షణలు

మార్కాపురం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

మార్కాపురం, నవంబర్ 21 (ఎన్ టుడే న్యూస్): ఈ నెల 26వ తేదీన జరగనున్న సర్పంచ్ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ శనివారం మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు అందజేశారు.

కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వివరాలను కలెక్టర్‌కు అందజేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆయా కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో పాటు అదనపు కేంద్ర బలగాలను నియమించాలని విజ్ఞప్తి చేశారు.

హైరిస్క్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల లోపల, వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, పోలింగ్ ప్రక్రియను జిల్లా నిఘా కేంద్రం నుంచి నేరుగా పర్యవేక్షించేలా వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలు, గ్రామాల్లోని ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కూటమి పాలనలో ఓటర్లు, ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు, రాజకీయ కార్యకలాపాలకు ఆటంకాలు ఎదుర్కొంటున్నారని దద్దాల నారాయణ యాదవ్ తన వినతిపత్రంలో ఆరోపించారు. ఇటీవల నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు సంబంధించిన అంశాలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని ప్రత్యేకంగా కోరారు.

ఈ కార్యక్రమంలో కనిగిరి రూరల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ మడతల కస్తూరి రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.