BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:47 pm
Posted by : KOLA MAHESH

గంజాయి, గుడుంబా అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
27 Oct, 2026 - 09:47 PM
15 వీక్షణలు
  • పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ డా. శబరీష్‌

నెల్లికుదురు, అక్టోబర్‌ 27 | ఎన్‌ టుడే న్యూస్‌:

గంజాయి, గుడుంబా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ డా. శబరీష్‌, ఐపీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లికుదురు పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్టేషన్‌లో విధుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, సాంకేతిక వ్యవస్థల వినియోగం, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై స్థానిక ఎస్‌ఐ గంగారపు కరుణాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరు, నిరంతర పర్యవేక్షణపై సమీక్షించారు.

పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించాలని తెలిపారు. స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు ప్రజలతో సమన్వయం పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

గ్రామాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచుతూ శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీసీటీఎన్‌ఎస్‌ (CCTNS) ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న పోలీసు సేవలు, కేసుల నమోదు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఎస్పీ పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పోలీసు సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించాలని సూచించారు.

గంజాయి అక్రమ రవాణా, వినియోగం, గుడుంబా తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అనుమానితుల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ, పాత నేరస్థులు, పునరావృత నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా కొనసాగించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహించి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణ, అక్రమ రవాణా నిరోధం, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టి ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించాలని ఎస్పీ డా. శబరీష్‌ స్పష్టం చేశారు.