BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 07:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Sep, 2026 - 07:42 AM
22 వీక్షణలు

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: AISF విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం: AISF

GO 77 రద్దు చేయాలి.. BT కళాశాలకు యూనివర్సిటీ హోదా ఇవ్వాలి

మదనపల్లె: విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని AISF అన్నమయ్య జిల్లా సమితి ఆరోపించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ AISF ఆధ్వర్యంలో మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా AISF అన్నమయ్య జిల్లా కార్యదర్శి కె. మాధవ్ మాట్లాడుతూ ఉన్నత విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసే విధంగా ఉన్న GO నెం.77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లె BT కళాశాలకు యూనివర్సిటీ స్థాయి హోదా కల్పించాలని కోరారు.

జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాలని, అన్ని వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ విద్యార్థుల మెస్ నిర్వహణకు సరిపడే విధంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించిన ఆయన, హామీల అమలుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని, లేకపోతే జిల్లావ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కె. మాధవ్ హెచ్చరించారు.