BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 09:03 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నామినేషన్ల వేళ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 Nov, 2026 - 09:03 AM
22 వీక్షణలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లె, నవంబర్ 21 (ఎన్ టుడే న్యూస్): మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో 156 గ్రామ పంచాయతీలకు సంబంధించి 43 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ తెలిపారు.

నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలోకి అనధికార వ్యక్తులు, వాహనాలకు ప్రవేశం ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి, వారి ప్రతిపాదకులను మాత్రమే క్యూలైన్ ద్వారా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు.

ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా 30 యాక్ట్, బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.