BREAKING
thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రగడవరంలో టీడీపీ ఎన్నికల ప్రచార హోరు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Nov, 2026 - 08:10 PM
6 వీక్షణలు

పాల్గొన్న శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ 

అభివృద్ధి పనులే అజెండాగా ప్రజల్లోకి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గ్రామగ్రామాన కూటమి అభ్యర్థుల ప్రచారం.. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్వయంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులనే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో చేపట్టిన పనులను వివరిస్తున్నారు. ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఎంపీ సహకారంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రజలకు తెలియజేస్తున్నారు. ముక్కంపాడు గ్రామంలో రూ.40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, మాలపల్లి గ్రామంలో రూ.40 లక్షలతో వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఫోనుకుమాడు గ్రామంలో సీసీ రోడ్లు, శ్మశానవాటికల అభివృద్ధితో పాటు విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ప్రగడవరం హరిజనపేట అభివృద్ధికి నిధుల కేటాయింపు, అంకంతల్లి గుట్టపై విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గొల్లగూడెంలో ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని అభ్యర్థులు ప్రజలకు హామీ ఇస్తున్నారు. దీంతో ప్రగడవరంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, కనమత రెడ్డి రాజారెడ్డి, జనసేన నాయకులు కొసన చంద్రబాబు, చిలుకూరి శ్రీనివాస్ రెడ్డి, చిలుకూరి సుధీర్ రెడ్డి (అమ్ము)తో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.