పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు టీడీపీ నేత సస్పెన్షన్
తిరువూరు: అక్టోబర్ 30
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కొలికపోగు తిరుపతయ్య (చంటి)పై పార్టీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ప్రకటించారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో తిరుపతయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అక్టోబర్ 30న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవనే సంకేతాన్ని ఈ నిర్ణయం ఇచ్చింది.
— గద్దె అనురాధ, అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ జిల్లా.