చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా, అక్టోబరు 2: చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అన్నమయ్య జిల్లాలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమానికి తరలివెళ్లారు.
సీఎం పర్యటనలో పాల్గొనేందుకు లద్దిగం గ్రామం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు బయలుదేరారు. పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లినట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు.
రమణారెడ్డి, వెంకటరమణరెడ్డి, చంద్రబాబు, ఆదినారాయణ తదితరులతో పాటు పలువురు కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు బస్సులో అన్నమయ్య జిల్లాకు బయలుదేరారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లడంతో లద్దిగం గ్రామంలో సందడి నెలకొంది.