BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రామచంద్రపురంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి రోజా రాణికి తెలంగాణ మంత్రి తుమ్మల శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 02:00 PM
63 వీక్షణలు

కాన్వాయ్ నిలిపి మరీ అభినందనలు తెలిపిన మంత్రి.. టీడీపీ శ్రేణుల్లో రెట్టింపైన ఉత్సాహం

ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడి ఊపందుకుంది. టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గడ్డి కృష్ణారెడ్డి సతీమణి రోజా రాణి నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీతో బయలుదేరారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ర్యాలీ గ్రామీణ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. పార్టీ శ్రేణుల నినాదాలు, కార్యకర్తల ఉత్సాహంతో ర్యాలీ సందడిగా సాగింది.

ఈ క్రమంలో విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్గమధ్యంలో ర్యాలీని గమనించి తన కాన్వాయ్‌ను నిలిపారు. అనంతరం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి రోజా రాణిని అభినందించి, ఎన్నికల బరిలో నిలుస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి స్వయంగా కాన్వాయ్ ఆపి అభ్యర్థిని పలకరించి అభినందించడం అక్కడి నాయకులు, కార్యకర్తల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయంగా భిన్న పార్టీల్లో ఉన్నప్పటికీ రోజా రాణికి ఆయన శుభాకాంక్షలు తెలపడం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పరిణామంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రోజా రాణి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన కార్యకర్తలకు మంత్రి అభినందనలు మరింత ఉత్సాహాన్ని అందించాయి. రామచంద్రపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైం

ది.